NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 10:07 pm Posted by : NAMASTHE BHARAT

జుగా” ప్రోగ్రాం కింద నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు

జుగా” ప్రోగ్రాం కింద నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు

ఖానాపురం ఆగష్టు23(నమస్తే భారత్ ) :
ప్రతి ఇంటికి నాణ్యమైన , నిరంతర విద్యుత్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో, సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో పెద్దమ్మ గడ్డ తండాలో “జుగా” ప్రోగ్రాం కింద తండా మొత్తం నూతన విద్యుత్ లైన్లను, స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది.పాత లైన్ల వల్ల తరచూ లో-వోల్టేజీ, విద్యుత్ అంతరాయం సమస్యలు ఉండేవి. సర్పంచ్ ప్రత్యేక చొరవతో విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో ఈ నూతన లైన్ల పనులు చేపట్టారు. దీని ద్వారా తండాలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన కరెంటు అందనుంది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్ గ్రామస్తులు పల్నాటి శ్రీనివాస్, వల్లెపు శ్రీనివాస్, కందుల సాంబయ్య, భూక్య నవీన్, గుగులోతు గణేష్, తండా వాసులు పాల్గొన్నారు.