NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 9:32 pm Posted by : NAMASTHE BHARAT

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

నమస్తే భారత్ :-తొర్రూరు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని చెరువు వద్ద మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.బతుకమ్మల నిమజ్జనం జరిగే ప్రాంగణంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులు, లైటింగ్, భద్రతా చర్యలు మరియు ఇతర మౌలిక సదుపాయాల పురోగతిని ఆయన అధికారులతో కలిసి నేరుగా పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ… ఉత్సవాలకు విచ్చేసే మహిళలకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద పారిశుధ్య లోపం లేకుండా చూడాలని, తగినన్ని తాగునీటి సదుపాయాలు మరియు విద్యుత్ దీపాల అమరికను పూర్తి చేయాలని సూచించారు.
ప్రజల సౌకర్యమే ప్రధాన ధ్యేయంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.