అరులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ఇంటి నిర్మాణానికి 15 లక్షలు ఇవ్వాలి
గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలి
సిపిఎం మండల నాయకులు బాణాల రాజన్న
నమస్తే భారత్ :-మరిపెడ
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ఇంటి నిర్మాణానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సిపిఎం మండల నాయకులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆగస్టు 16 ఆదివారం రోజున మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం చేనేబోయిన ఎంకన్న అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రాజన్న మాట్లాడుతూ రెండో విడత ఇంద్ర మైండ్లు అర్హులైన వారందరికీ కేటాయించాలని ఇంటి మెటీరియల్ ఖర్చులు బాగా పెరిగినందున ఇంటి నిర్మాణానికి 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో సైడ్ కాలువలు లేక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై దోమలు వల్ల టైఫాయిడ్ మలేరియా డెంగు తదితర జబ్బులు వస్తున్నాయని ప్రజలను కాపాడడానికి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మహిళలకు 2500 రూ పెన్షన్ పెంపు రూ 4000 వికలాంగులకు 6000 చేనేత గీత ఒంటరి మహిళలు తదితరుల పెన్షన్లను పెంచి ఇవ్వాలని రేషన్ కార్డు పై 16 రకాల నిత్య సరుకులు ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో మండల నాయకులు తూము విజయ్ కుమార్ చేనేబోయిన వెంకన్న ఉండ్రాచి సురేష్ పోలోజు సోమన్న బోలు సాయి సందు సోమన్న ఎల్లె రాములు బొజ్జమంగమ్మ తదితరులు పాల్గొన్నారు