NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:11 pm Posted by : NAMASTHE BHARAT

*ఎస్‌జీఎఫ్‌ వాలీబాల్‌లో ఇండియన్‌ హైట్స్‌ విద్యార్థుల సత్తా*

*ఎస్‌జీఎఫ్‌ వాలీబాల్‌లో ఇండియన్‌ హైట్స్‌ విద్యార్థుల సత్తా*

*తాలూకా స్థాయి పోటీలకు షాద్‌నగర్‌ ఇండియన్‌ హైట్స్‌ జట్టు ఎంపిక*

నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్11:క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటూ ఇండియన్‌ హైట్స్‌ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. షాద్‌నగర్‌ మినీ స్టేడియంలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్‌ మండల స్థాయి అండర్‌-14 బాలుర వాలీబాల్‌ పోటీల్లో ఇండియన్‌ హైట్స్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. దీంతో తాలూకా స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైంది.మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 350 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా.. ఇండియన్‌ హైట్స్‌ జట్టు సమష్టి కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో ఆటను కొనసాగించింది. ప్రత్యర్థి జట్లను దీటుగా ఎదుర్కొంటూ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజేతగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభతో పాఠశాలకు మంచి పేరు రావడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.విజయం సాధించిన క్రీడాకారులను పాఠశాల చైర్మన్‌ భువనేశ్వర్‌ ద్రాక్షాయణి, డైరెక్టర్లు, ప్రిన్సిపల్‌ అభినందించారు. విద్యార్థులకు ట్రోఫీ అందించి మరింత ఉత్సాహాన్ని కల్పించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. తాలూకా స్థాయిలోనూ ఇదే స్ఫూర్తితో ఆడి విజయం సాధించి, భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.క్రీడాకారులకు శిక్షణ అందించిన పీఈటీలు రవికుమార్‌, దేవిని కూడా యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ భువనేశ్వర్‌ ద్రాక్షాయణి, డైరెక్టర్లు మహేష్‌, విశ్వేశ్వర్‌, జగదీశ్వర్‌, ప్రిన్సిపల్‌ సునీత, పీఈటీలు రవికుమార్‌, దేవి తదితరులు పాల్గొన్నారు.