రంజిత్ హెయిర్ స్టైల్ సెలూన్‌ను ప్రారంభించిన
మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రాంలాల్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రంజిత్ హెయిర్ స్టైల్ సెలూన్ను శుక్రవారం మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి రంగంలోకి రావాలని, కష్టపడి పనిచేస్తే వ్యాపారంలో మంచి విజయాలు సాధించవచ్చని అన్నారు.
నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన రంజిత్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పానుగోత్ రాంలాల్, కాంగ్రెస్ యువజన నాయకుడు మద్దోజు మురళి, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మామిడాల మునేష్, సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు.తదితరులు పాల్గొన్నారు.