NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 8:52 pm Posted by : NAMASTHE BHARAT

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

పార్లమెంటులో శాసన సవరణ చేయాలి

తపస్ జిల్లా శాఖ పక్షాన
కలెక్టర్ ఏవో కు వినతి
నమస్తే భరత్,,
జూన్ 18,/6/2026,,నారాయణపేట…
ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుండి
2010 కి ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణపేట జిల్లా శాఖ పక్షాన కలెక్టరేట్లో పరిపాలన అధికారి అనిల్ కుమార్ కు
వినతిపత్రం సమర్పించారు.
ఇట్టి వినతి పత్రాలను ప్రధానమంత్రి, కేంద్ర విద్యా శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిలకు పంపవలసిందిగా కోరారు. రాబోయే శీతాకాల సమావేశంలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి టెట్ మినహాయింపు తప్పకుండా ఇవ్వాల్సిందేనని కోరారు.
పరీక్ష విధానం మారకుండా ఎన్నిసార్లు టెట్ రాసిన ఉపాధ్యాయులకు సరైన న్యాయం జరగదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహ రవీందర్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేక్ కృష్ణారెడ్డి రాష్ట్ర నాయకులు గుంపు బాల్రాజ్ మండల నాయకులు నర్సింలు శ్రీనివాస్ జగదీష్ పాల్గొన్నారు.