NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 11:53 am Posted by : NAMASTHE BHARAT

జీడిమెట్లలో కట్ట మైసమ్మ–బంగారు మైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా

జీడిమెట్లలో కట్ట మైసమ్మ–బంగారు మైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా

-అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నేత చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి

-ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కార్యదర్శి

-భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు

-జీడిమెట్ల గ్రామంలో భక్తుల సందడి

-ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక హోమాలు, పూజలు

-పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తుల పాల్గొనిక

జీడిమెట్ల, జులై 12 ( నమస్తే భరత్ ):
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ కట్ట మైసమ్మ తల్లి మరియు శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతల ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఆద్యంతం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను అభినందిస్తూ, ఆలయ నిర్మాణం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రబిందువులని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సనాతన ధర్మ పరిరక్షణను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ మహోత్సవంలో డా. ఎస్. మల్లారెడ్డి, కృష్ణా, జోగిని రాజు, మహిపాల్ రెడ్డి, దమ్మని కుమారస్వామి, వీరేష్, దమ్మని యశ్వంత్, మల్లేష్, లక్ష్మణ్, నాగరాజు, శోభన్, ఆంజనేయులు, మధు, దయాకర్, పాపయ్య దొర, శ్రీకాంత్‌తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా సాగింది.