డీజే.. బ్యాండ్ మేళం లేకుండా
ఆదర్శంగా వినాయక నిమజ్జనం

చిన్నారులకు టీ షర్ట్లు బహుమతి ఇచ్చిన
కాంగ్రెస్ పార్టీ మరిపెడ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్
నమస్తే భారత్ :-మరిపెడ
చిన్నారులు ఏర్పాటు చేసిన వినాయక మండపం.. భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు.. పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం.. ఇలా ఆదర్శంగా నిలిచారు మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 4వ వార్డు గోపాల్‌రావుపేటకు చెందిన చిన్నారులు.
గోపాల్‌రావుపేటలో చిన్నారులు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వినాయక కమిటీ సభ్యులు జినుక అనిల్, జినుక శ్యామ్, చింత తారకేశ్వర్, చింత కార్తీక్, నందగిరి సాయిరాం, కత్రోజ్ యశ్వంత్ తదితరులు ఉత్సవాలు నిర్వహించారు
పోలీసుల సూచనలు పాటిస్తూ
మరిపెడ పోలీసుల సూచనల మేరకు వినాయక నిమజ్జనాన్ని ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని. సీఐ ఎల్.పవన్‌కుమార్, ఎస్సై గండ్రతి సతీష్ సూచించిన నిబంధనలను పాటిస్తూ డీజేలు, బ్యాండ్ మేళాలకు దూరంగా ఉంటూ నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించారు
చిన్నారులకు టీ షర్ట్లు బహుమతి ఇచ్చిన
కాంగ్రెస్ పార్టీ మరిపెడ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్
డీజేలు, బ్యాండ్ మేళాలకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించిన చిన్నారులను కాంగ్రెస్ పార్టీ మరిపెడ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్. వినాయక కమిటీ సభ్యులు ,జినుక అనిల్, జినుక శ్యామ్,
చింత తారకేశ్వర్, చింత కార్తీక్, కత్రోజ్ యశ్వంత్, నందగిరి సాయిరాం, చిన్నారులను అభినందించి టీషర్టులను బహుమతిగా అందజేశారు
వినాయక కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మరిపెడ పట్టణ అధ్యక్షులు పానుగోతు రాంలాల్ , ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు