పూజిత ఎన్క్లేవ్ అభివృద్ధికి అండగా ఉంటా

నూతన కార్యవర్గానికి శ్రీశైలం గౌడ్ అభినందనలు
మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ
కుత్బుల్లాపూర్, ఆగస్టు 10 ( నమస్తే భరత్ ): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బండారి లేఔట్ డివిజన్‌లో ఉన్న పూజిత ఎన్క్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను షాపూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు విద్యాసాగర్‌తో పాటు కార్యవర్గ సభ్యులను శ్రీశైలం గౌడ్ అభినందించి శాలువాతో సన్మానించారు. పూజిత ఎన్క్లేవ్ కాలనీ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కాలనీకి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నూతన కార్యవర్గం సమన్వయంతో పనిచేయాలని శ్రీశైలం గౌడ్ ఆకాంక్షించారు. నూతన అధ్యక్షుడు విద్యాసాగర్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని పలువురు శుభకార్యాల ఆహ్వాన పత్రికలను శ్రీశైలం గౌడ్‌కు అందజేసి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో పూజిత ఎన్క్లేవ్ మాజీ అధ్యక్షుడు శరత్, అమర్, బెనర్జీ, రాజు, నరేంద్ర, వెంకట్‌రాజు, శ్రీనివాస్‌రెడ్డి, ఉదయ్, శివారెడ్డి, శ్రీనివాసులు, రణధీర్, అరవింద్, యాదగిరి, ఏ.కె.రావు తదితరులు పాల్గొన్నారు.