NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:05 pm Posted by : NAMASTHE BHARAT

న్యూ శివాలయ నగర్ అభివృద్ధికి సహకరిస్తా: కూన శ్రీశైలం గౌడ్

న్యూ శివాలయ నగర్ అభివృద్ధికి సహకరిస్తా: కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్, ఆగస్టు 14 ( నమస్తే భారత్ సూరారం డివిజన్ పరిధిలోని న్యూ శివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సందీప్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను కూన శ్రీశైలం గౌడ్ అభినందించారు. న్యూ శివాలయ నగర్ కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, ప్రభుత్వ పరంగా కూడా అవసరమైన అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం అధ్యక్షుడు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పలు శుభకార్యాల ఆహ్వాన పత్రికలను అందజేయడంతో పాటు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కూన శ్రీశైలం గౌడ్‌ను ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రదీప్, రేవంత్ కుమార్, జానకిరామ్, కరుణాకర్, రవి, శ్రీనివాస్, విజయ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు నాగిల్లు శ్రీనివాస్, చౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.