శంభీపూర్ రాజును పరామర్శించిన హరీశ్ రావు, మహిపాల్ రెడ్డి
శంభీపూర్ రాజును పరామర్శించిన హరీశ్ రావు, మహిపాల్ రెడ్డి ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా శంభీపూర్ నివాసానికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్ ): వరంగల్ జిల్లాలోని కన్నెపల్లి రిజర్వాయర్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును సోమవారం పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి హరీశ్ రావు శంభీపూర్‌లోని...