పట్టు పరిశ్రమ ద్వారా అధిక లాభాలు: ఏఎస్ఓ లింగం మెదక్,
సెప్టెంబర్10 (నమస్తే భరత్)
:పట్టు పురుగుల పరిశ్రమ ఏర్పాటు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని అసిస్టెంట్ సేరి కల్చరల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) లింగం అన్నారు.గురువారం రోజు మెదక్ జిల్లా,చిలిపిచెడు మండలంలోని గౌతాపూర్ గ్రామంలో రైతు బాబు సింగ్ ఏర్పాటు చేసిన పట్టు పురుగుల పరిశ్రమ ను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు,సలహాలు ఇచ్చామన్నారు.రైతులు ఏర్పాటు చేసుకున్న 30 రోజులలో పట్టు పురుగులు గుళ్ళు అల్లుకుంటాయని ఆయన వెల్లడించారు. ఓక కేజీ పట్టు గుళ్ళ ధర రూ.రూ.600-800/- వరకు ఉంటుందని పేర్కొన్నారు. రైతులు జనగామ, సికింద్రాబాద్ తిరుమల గిరి ప్రాంతాల్లో విక్రయించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.పట్టు పురుగుల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొనుటకు ప్రభుత్వం జనరల్ వారికి 50 శాతం,ఎస్సీ,ఎస్టీ లకు 65 శాతం వరకు సబ్సిడీలు ఇస్తుందని ఆయన చెప్పారు.రైతులు పట్టు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు.