NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 8:27 pm Posted by : NAMASTHE BHARAT

పోటీ పరీక్షల బోధనకు అతిథి అధ్యాపకులకు ఆహ్వానం

పోటీ పరీక్షల బోధనకు అతిథి అధ్యాపకులకు ఆహ్వానం

ఖానాపురం నవంబర్ 6 ( మల్లేష్ నమస్తే భారత్): విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఖానాపురం మండలంలోని బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాల అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పెరక సునీత ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు బోధించేందుకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

*అర్హతలు ఇవే*…..

ఎల్.ఎల్.బి./ఎల్.ఎల్.ఎం., ఎం.ఏ. ఇంగ్లీష్, ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. బోధనలో అనుభవంతో పాటు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
ఎంపికైన అతిథి అధ్యాపకులకు ఒక్కో పీరియడ్‌కు రూ.650 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. తరగతులు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2026 నవంబర్ 10లోగా బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలని ప్రిన్సిపల్ పెరక సునీత సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.