మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి

ప్రగతి నగర్‌లో విగ్రహానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ నాయకులు – భూపతిరెడ్డి
కుత్బుల్లాపూర్, జూలై 4 ( నమస్తే భరత్ ): భారతీయుల్లో స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ డివిజన్‌లో ఉన్న ఆయన విగ్రహానికి మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు దేశభక్తి, త్యాగం, ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలన్ రాజశేఖర్ రెడ్డి, ప్రగతి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, బండారు లేఔట్ డివిజన్ అధ్యక్షుడు వరగాని వాసు, నిజాంపేట్ డివిజన్ అధ్యక్షుడు కోటపాటి మురళి, సీనియర్ నాయకులు తులసిదాస్, గూడూరు మురళీకృష్ణ, డా. మద్ది నారాయణరెడ్డి, బత్తుల చిరంజీవి, ప్రశాంత్ రెడ్డి, దాసరి మహేష్, పుచ్చకాయల సాంబశివరావు, పాటిబండ్ల హరిష్, వీరయ్య తదితరులు పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.