NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 9:35 pm Posted by : NAMASTHE BHARAT

చెరుకుపల్లి చంద్రారెడ్డికి ఘన నివాళి

చెరుకుపల్లి చంద్రారెడ్డికి ఘన నివాళి

-35వ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్‌లో స్మారక సభ

-బీజేపీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్థుల నివాళులు

-ప్రజాసేవలో ఆయన చూపిన మార్గం ఆదర్శనీయం.. భరత్ సింహారెడ్డి

-సేవా స్ఫూర్తిని కొనసాగించాలని నాయకుల పిలుపు

-పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు

జీడిమెట్ల, జూలై 11 ( నమస్తే భారత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలోని బీజేపీ కార్పొరేటర్ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు, దివంగత శ్రీ చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి 35వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలతో కలిసి చంద్రారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, చెరుకుపల్లి చంద్రారెడ్డి ప్రజాసేవ, సామాజిక నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన సేవలు సమాజానికి చిరస్మరణీయమని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు డా. ఎస్. మల్లారెడ్డి, నందనం దివాకర్, శంకర్ రెడ్డి, నటరాజ్ గౌడ్, బాలకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య, సాయిబాబా, డివిజన్ అధ్యక్షులు రాజు, మణికంఠ, రాజేష్, శ్రీనివాస్ గౌడ్, సిద్ధిరామ్ రెడ్డి, యు.ఎన్.ఆర్. సురేష్ గౌడ్, సీనియర్ సిటిజన్లు పెద్ది మల్లేష్, మురళి, భాను చందర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.