NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 10:25 pm Posted by : NAMASTHE BHARAT

సోమారంలో వైభవంగా శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

సోమారంలో వైభవంగా శివాలయ పునఃప్రతిష్ఠాపన
వేడుకల్లో పాల్గొన్న

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో నిర్వహించిన శివాలయం పునఃప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.శివాలయం పునఃప్రతిష్ఠాపన సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడం.ఆనందదాయకమని పేర్కొన్నారు.ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐకమత్యాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,మండలం పార్టీ అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి,సీనియర్ నాయకుడు కుందూరు విద్యాకర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పున్నం రామ్మూర్తి, యూత్ అధ్యక్షుడు ఘర్షల రాజేష్, కాంగ్రెస్ నాయకులు ఘర్షల శ్రీనివాస్, కరుణాకర్, మునిగేటి గిరిధర్,గడ్డం గట్టుమల్లు,బోలే షావలి, నలమాస రాహుల్,భాష బోయిన నరేష్,కొరుపెల్లి రమేష్,మేడి వెంకన్న, ఇతర నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.