హరిపిరా లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
హరిపిరా లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నమస్తే భారత్ :-తొర్రూరు పట్టణంలోని హరిపిరాలకు వెళ్లే రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో కోలాటం ఆడి, ఉట్టి కొట్టి సందడి చేశారు. ఉపాధ్యాయులు శ్రీకృష్ణుడు, కుచేలుడి మధ్య స్నేహాన్ని, శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని, భారతాన్ని విద్యార్థులకు వివరించారు.ఈ.కార్యక్రమంలో హెచ్ఎం శారద దేవి, ఉపాధ్యాయులు విమలా దేవి, ఎస్కే దర్గా హుస్సేన్, జి. రేణుక, రోజా, మౌనిక, మమత, పల్లవి,...