NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 9:13 pm Posted by : NAMASTHE BHARAT

పాపన్నపేట మండల కేంద్రంలో ఘనంగా హార్గర్ తిరంగా ర్యాలీ:

పాపన్నపేట మండల కేంద్రంలో ఘనంగా హార్గర్ తిరంగా ర్యాలీ:

మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి
మెదక్,ఆగస్టు12(నమస్తే భరత్):భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ భారతవని సంబరాలు చేసుకుంటున్న వేళ ప్రియతమ ప్రధాని, ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి తెలిపారు.ఇందులో భాగంగా మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాసు రాధా మల్లేష్ గౌడ్ ఆదేశాల మేరకు బుధవారం రోజు పాపన్నపేట మండల కేంద్రంలో జాతీయ వాదులు,బిజెపి నాయకులు,ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు మువ్వన్నెల జెండాలు చేత బూని పాపన్నపేట మండల కేంద్రం పురవీధుల్లో కవాతు ర్యాలీ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎంతోమంది భరతమాత బిడ్డల త్యాగాల ఫలితమేనని అందుకుగాను ప్రతి భారతీయుడు,యువత దేశభక్తిని పెంపొందించుకొని రాబోయే కాలంలో తమ వంతుగా దేశ కీర్తిని ఔన్నత్యాన్ని ఖండాంతరాలు దాటించే విధంగా ప్రతి ఒక్కరూ కృషిచేసి తమ తమ రంగాలలో రాణిస్తూ దేశభక్తిని కలిగి ఉన్నతమైన భారతీయ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బీకొండ రాములు నేత, రాష్ట్ర ఓబీసీ కార్య వర్గ సభ్యులు గడ్డం కాశీనాథ్,బీజేపీ జిల్లా నాయకులు సుభాష్ చందర్ గౌడ్,ఏంఎల్ఎన్. రెడ్డి,నాగభూషణం, మల్లేశం,బొక్కల భాగేష్, వడ్లభాగేష్,జిన్నగోపాల్, రాజు,చంద్రయ్య,సుంకరి కిష్టయ్య,నర్సింలు,వెంకట్, శ్రావణ్,గౌస్,జగదీష్ సంతోష్ గౌడ్,కనుకంటి విట్టల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్,అధ్యాపకులు గ్రామస్తులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.