NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 10:03 pm Posted by : NAMASTHE BHARAT

మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్నకు ఘన సన్మానం

మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్నకు ఘన సన్మానం

మూడో వార్డు కౌన్సిలర్ రాములు,

నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము కౌన్సిలర్

 

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైన గుండగాని వెంకన్నను శనివారం మూడో వార్డు కౌన్సిలర్ రాములు,నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము కౌన్సిలర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు వెంకన్నను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మెరుగు రాము, రాములు.మాట్లాడుతూ.గుండగాని వెంకన్న ప్రజల విశ్వాసానికి అనుగుణంగా సేవలందించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేసే అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రామగిరి సత్యనారాయణ, మైనార్టీ నాయకుడు యాకుబ్ పాషా, బయ్య లింగయ్య,గుంటి రవి,భాషిత్ ఖాన్, వెంకన్నతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు.పాల్గొన్నారు.