జీడిమెట్లలో ఘనంగా కట్ట మైసమ్మ–బంగారు మైసమ్మ–గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
-ముఖ్య అతిథిగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ హాజరు
-అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.. ప్రజల సుఖశాంతి కోసం ప్రార్థనలు
-శాలువాతో ఘన సత్కారం.. తీర్థప్రసాదాల అందజేత
భక్తులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భారీ లో హాజరు
జీడిమెట్ల, జులై 11 ( నమస్తే భరత్ ); జీడిమెట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ, బంగారు మైసమ్మ, గంగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సుభిక్షంగా జీవించాలని అమ్మవార్లను ప్రార్థించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిలుకూరి కృష్ణా, బాలప్ప, వీరేష్ ముదిరాజ్, మల్లేష్, శ్రీను, మహిపాల్ రెడ్డి, అంజయ్యతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.