NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 8:20 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడ లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

మరిపెడ లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా

సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలోని ఎస్‌బీఐ కాలనీలో బుధవారం.ప్రజాకవి.కాళోజీ.నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాన్ని ప్రశ్నించిన గొప్ప ప్రజాకవి అని అన్నారు. పాలకుల తప్పులను ఎత్తిచూపుతూ, ప్రజల హక్కుల కోసం తన కలంతో నిరంతరం పోరాడారని తెలిపారు.కాళోజీ సాహిత్యంలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని గుర్తుచేస్తూ.తప్పును తప్పని చెప్పే.ధైర్యం.ఉండాలి,అన్యాయాన్ని ప్రశ్నించే స్వరం ఉండాలి.అనే భావంతో ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నించాలని, పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాళోజీ సాహిత్యం చాటిచెప్పిందని అబ్దుల్ రషీద్ అన్నారు.పేదలు, కార్మికులు, రైతులు, అణగారిన వర్గాల సమస్యలపై కాళోజీ చూపిన చైతన్య స్ఫూర్తిని నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటమే కాళోజీకి నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సత్యం, సోహెల్ సోమన్న, వెంకన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు