వైభవంగా శ్రీరామ హృదయ కళశ పూజలు

ఖానాపురం ఆగష్టు8 (నమస్తే భారత్ ) :
కళశ ప్రచారకర్త దాస్యం రంగనాధస్వామి పిలుపు మేరకు శనివారం స్థానిక ఖానాపురం లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ హృదయ కళశ పూజాదికాలు అర్చకులు శివప్రసాద్ శాస్రి ఘనంగా నిర్వహించారు. వికాస తరంగిణి నర్సంపేట శాఖ బాధ్యులు వెంశెట్టి రమాదేవి శ్రీనివాస్ , పంచమర్తి సరిత, సింగిరికోండి రమేష్ ఆలయ కమిటీ గ్రామ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణములు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా శ్రీరామ కళశ ప్రచారక్ రంగనాధస్వామి మాట్లాడుతూ మన ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి దివ్య మంగళాశాసనములతో, శ్రీశ్రీశ్రీ దేవనాథ జీయర్ స్వామి వారు చాతుర్మాస్య దీక్షా సందర్భంగా శ్రీరంగంలో “శ్రీమదష్టాక్షరీ మహామంత్ర కోటి జప హోమం” నిర్వహిస్తున్నారు. ఈమహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ ఆగస్టు 4, 2026 నుండి ప్రారంభమై భక్తులందరికీ దైవానుగ్రహాన్ని ప్రసాదించే పుణ్యావకాశంగా దిగ్విజయంగా కొనసాగుతోంది
అష్టాక్షరీ మహామంత్రం ద్వారా లోకక్షేమం, శాంతి, సౌభాగ్యం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కలగాలని సంకల్పించి ఈ కోటి జప హోమం నిర్వహించబడుతోందన్నారు.అందరూ ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములై, అష్టాక్షరీ మహామంత్ర జపంలో పాల్గొని, భగవదనుగ్రహాన్ని పొందవలసిందిగా గురువు ద్వారా సమాశ్రయన పరులు దైవ సేవలో ఉండాలి అని అసలు సమాస్రయణం అనేది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక లాంఛనప్రాయమైన ఆధ్యాత్మిక దీక్షా వ్యక్తులు సాధకుడు అర్హతగల గురువుకు (ఆచార్యునికి) శరణాగతి పొంది, అధికారికంగా శిష్యుడిగా స్వీకరించబడతాడు ఇది ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పునర్జన్మను మరియు శ్రీమాన్ నారాయణ భగవానునికి అంకితమైన అనుచరునిగా సమాజంలోకి ప్రవేశాన్ని సూచిస్తుంది అర్హత కలిగిస్తుంది, దైవం సంపూర్ణ శరణు అంటే ఆధ్యాత్మిక విముక్తి మోక్షం పొందడానికి ఆచార్యుని పాదాల చెంత “సంపూర్ణ ఆశ్రయం కోరడం” దీన్నే సమాశ్రయణం అంటారు, ఇది వ్యక్తిని అవిచ్ఛిన్నమైన ఆలోచనలు గురు-శిష్య పరంపరకు అనుసంధానిస్తుంది ఆధ్యాత్మిక గుర్తింపు దారి మల్లుతుంది ఇది ఒక దీక్ష తీసుకున్నవారి జీవనశైలిని మరియు రోజువారీ ఆరాధన పద్ధతులను పరివర్తన చెందిస్తుంది. వికాస తరంగిణి సమన్వయ కర్తడి ఆర్ ఎన్ స్వామి ఒక ప్రకటన లో తెలిపారు, అనంతరం ఆలయ అర్చకులు శ్రీరామ కళశమునకి పూజాదికాలు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జనులందరు అధ్యాత్మిక దారిలో ఉండాలని మహిళలు శ్రీరామ హృదయ కళశముతో భక్తులు గిరి ప్రధక్షణ చేశారు. మంగళశాసనాలు తీర్ధ ఘోష్టి తో పరిపూర్ణ మైనది