ఎస్‌ఆర్ వొకేషనల్ కళాశాలలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు
ఎస్‌ఆర్ వొకేషనల్ కళాశాలలో ఘనంగా గోరింటాకు ఉత్సవాల నర్సంపేట ఆగష్టు1 (నమస్తే భారత్ ) : నర్సంపేట పట్టణంలోని ఎస్‌ఆర్ వొకేషనల్ అండ్ పారామెడికల్ కళాశాలలో శనివారం గోరింటాకు (మెహంది) ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో అలంకరణమై అందమైన మెహంది డిజైన్లతో భారతీయ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించారు. ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుంటూ స్నేహభావాన్ని, ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుని అందరినీ ఆకట్టుకుంది.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కొయ్యడి సనత్ కుమార్ మాట్లాడుతూ, "గోరింటాకు భారతీయ...