NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 6:21 pm Posted by : NAMASTHE BHARAT

ఎస్‌ఆర్ వొకేషనల్ కళాశాలలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఎస్‌ఆర్ వొకేషనల్ కళాశాలలో ఘనంగా గోరింటాకు ఉత్సవాల

నర్సంపేట ఆగష్టు1 (నమస్తే భారత్ ) :

నర్సంపేట పట్టణంలోని ఎస్‌ఆర్ వొకేషనల్ అండ్ పారామెడికల్ కళాశాలలో శనివారం గోరింటాకు (మెహంది) ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో అలంకరణమై అందమైన మెహంది డిజైన్లతో భారతీయ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించారు. ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుంటూ స్నేహభావాన్ని, ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుని అందరినీ ఆకట్టుకుంది.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కొయ్యడి సనత్ కుమార్ మాట్లాడుతూ, “గోరింటాకు భారతీయ సంస్కృతికి ప్రతీక. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఐక్యత, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు చురుకుగా పాల్గొనడం వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుందన్నారు. మన సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని అన్నారు.అనంతరం విజేతలకు బహామతులు అందజేశారు. ఈకార్యక్రమంలో
ఎస్‌ఆర్ పారా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కొయ్యడి శిరీష, డైరెక్టర్ కొయ్యడి సరళ, వైస్ ప్రిన్సిపాల్ అజ్మీరా సూరయ్య, అధ్యాపకులు వరంగంటి సందీప్, వరంగంటి శ్వేతా, శతారసి కుమార్, జి. హరిబూషణ్, బి. వెంకన్న, ఎన్. రమేష్ నాయక్, డి. నాగేష్, ఎస్.కె. నజీమా , విద్యార్థినిలు ,ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గోన్నారు.