NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:33 pm Posted by : NAMASTHE BHARAT

ధనరాజ్ యాదవ్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

ధనరాజ్ యాదవ్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

బాచుపల్లి 2బీహెచ్‌కే అధ్యక్షుడు సలీమ్ భాయ్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు

ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్ష

బాచుపల్లి, ఆగస్టు 10 ( నమస్తే భరత్ ): నిజాంపేట్ సర్కిల్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్ జన్మదినం సందర్భంగా బాచుపల్లి 2బీహెచ్‌కే అధ్యక్షుడు సలీమ్ భాయ్ ఆధ్వర్యంలో పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ధనరాజ్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ధనరాజ్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ హైమద్ భాయ్, వినయ్, కట్ట రవి, షేక్ రఫిక్ తదితరులు పాల్గొని ధనరాజ్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.