NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 10:25 pm Posted by : NAMASTHE BHARAT

అర్హులైన వారందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు

అర్హులైన వారందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

ఖానాపురం నవంబర్ 15 (మల్లేష్ నమస్తే భారత్) :
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను 505 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అదివారం అందజేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని అన్నారు.
నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 4,900 పింఛన్లు మంజూరయ్యాయని, మరో 400 దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.ఇంకా మిగిలిపోయిన వారిలో
అర్హులైన ప్రతి ఒక్కరికి వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళ, గీత కార్మిక పెన్షన్, చేనేత కార్మికులకు పెన్షన్ లను తప్పనిసరిగా అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలోనర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,మార్కెట్ వైస్ చైర్మన్ ,కాంగ్రెస్ ఖానాపురం మండల పార్టీ అధ్యక్షుడు శాఖమూరిహారిబాబు,
పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ , తాహసిల్దార్ నంగునూరి రమేష్, ఎంపీడీవో వనపర్తి అద్వైత, డివిజన్ ఆత్మ చైర్మన్ యడ్ల బిక్షంరెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ గట్టి సారంగపాణి, సొసైటీ డైరక్టర్లు లింగడి వెంకటేశ్వర్లు, శివరాత్రి వెంకన్న, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్, ఆశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుతం,
బుధరావుపేట సర్పంచ్ పెసరు రాణిగోవర్థన్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచ్ లు ,పంచాయతీ కార్యదర్శులు ,కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు,సోషల్ మీడియా ఇంఛార్జీ నాంచారీ కుమారస్వామి తదితరులు పాల్గోన్నారు.