NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 6:30 pm Posted by : NAMASTHE BHARAT

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలి.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలి.

మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలి.

ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతిబసు.

నమస్తే భారత్ :-మరిపెడ

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నూతన విద్యా సంవత్సరం మొదలైన సందర్భంగా ఎస్ఎఫ్ఐ మరిపెడ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా గంధసిరి జ్యోతిబసు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరిపెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కి కేటాయించినటువంటి 5 ఎకరాల స్థలంలో నిరసన చేయడం జరిగింది., ఎస్ఎఫ్ఐ మహబూబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ పాఠశాలలను విస్తృతంగా సందర్శించడం జరుగుతుంది తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మరిపెడ/బంగ్లా మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి గత ప్రభుత్వ హయాంలో 2021 లో 5 ఎకరాల భూమిని (పెద్ద రాయి గుండు) కేటాయించారు గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ని ఏర్పాటు చేయాలని అనేకసార్లు వినతులు ఇచ్చిన అధికారులు,ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ప్రజా ప్రతినిధులకు పదుల మీదున్న శ్రద్ధ విద్యావ్యవస్థ పై ఎందుకు లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కార్యదర్శి పెద్దపులి బాసు, మండల సహాయ కార్యదర్శి బాణాల గోపి, నాయకులు రవి, వంశీ, నరేష్, సంతోష్, పృద్వి తదితరులు పాల్గొన్నారు.