మేడ్చల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ఎన్నిక

పార్టీ నాయకుల ఘన అభినందనలు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: భారతీయ జనతా పార్టీ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గిరివర్ధన్ రెడ్డికి పార్టీ నాయకులు ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ అధ్యక్షుడు మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మున్సిపల్ సెల్ కో-కన్వీనర్, గాజులరామారం మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, నందనం దివాకర్, బక్క శంకర్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు జెకె శేఖర్ యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, జిల్లా నాయకులు, ఓబీసీ మోర్చా, బీజేవైఎం, వివిధ మోర్చాల ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.