మరిపెడలో ఘనంగా గణపతి నిమజ్జన వేడుకలు

మరిపెడలో ఘనంగా గణపతి నిమజ్జన వేడుకలు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం గణపతి నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మాకుల పెద్దచెరువులో ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొని, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు....