NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:17 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడలో ఘనంగా గణపతి నిమజ్జన వేడుకలు

మరిపెడలో ఘనంగా గణపతి నిమజ్జన వేడుకలు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం గణపతి నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మాకుల పెద్దచెరువులో ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొని, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు మెరుగు రాము, గంట్ల గౌతమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ టౌన్ ప్రెసిడెంట్ షేక్ తాజోద్దిన్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి, చీనా నాయక్, బోడ రమేష్, చెన్నూరు మహేష్, గుండగాని బాబురావు తదితరులు పాల్గొన్నారు.