NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 4:38 pm Posted by : NAMASTHE BHARAT

సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ కోసం జారీ చేసిన జీవో నెంబర్ 641 వెంటనే రద్దు చేయాలి.

సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ కోసం జారీ చేసిన జీవో నెంబర్ 641 వెంటనే రద్దు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య.

నమస్తే భారత్ షాద్ నగర్, జులై 20:సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నెంబర్ 641 వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోమండల కార్యదర్శులు ముఖ్యులతో దేవీ గ్రాండ్ హోటల్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి ఈ ప్రకటన ఆయన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తూరు మండలంలో సిద్దాపూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల గ్రామాలతో పాటు గిరిజన తండాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని పొల్యూషన్ బారినపడి అక్కడున్న ప్రజానీకంతో పాటు వర్షాకాలంలో అక్కడ నుంచి ప్రవహించే నీరు రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ చెరువులో కలవడంతో త్రాగునీరు సాగునీరు కూడా కలుస్తమైపోయి ప్రజలందరూ కూడా రోగాల బారిన పడి అనారోగ్యాల గురవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ 641 జీవో కాంగ్రెస్ షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ ఈర్లపల్లి శంకర్ గారికి తెలియకుండానే వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు జీవో రాకుండా ఆపాల్సింది పోయి జీవో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్తూరు కేశంపేట మిగతా మండలాల నాయకత్వం పోరాటాలకు సిద్ధం కావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు వారు ఎవరి మీద పోరాటాలు చేస్తున్నారు కనీసం వారి కన్నా అవగాహన ఉందా అని ఆయన ఎదవ చేశారు కాంగ్రెస్ పార్టీ వారికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి జీవో రద్దు కోసం ప్రయత్నించాలి కానీ ప్రజల విశ్వాసం పొందడానికి అదే ప్రజలను సమీకరించి పోరాటాలు చేయడం ఇది ఓట్ల రాజకీయం కాదా అని ఆయన అడిగారు షాద్ నగర్ నియోజకవర్గం హైదరాబాద్ నగరానికి కూత పెట్టు దూరంలో ఉందని అతివేగంగా అభివృద్ధి అవుతున్న పట్టణాలలో షాద్నగర్ మొదటి స్థానంలో ఉందని భవిష్యత్తు తరాలకు ఈ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్రమైన అనారోగ్యాలతో పాటు
పుట్టే పసిపిల్లలకు కూడా కాలుష్య బారిన పడి అంగవైపర్యంతో పుట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా స్వాగతిస్తామని అదే ప్రజలకు నష్టం కలిగేదిగా ఉంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని ఆయన గంట పదంగా తెలిపారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా సిద్దాపూర్ పరిధిలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల నుంచి అనేక భూములను సేకరించిందని ఆ భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిందని అప్పుడు కూడా మేము ప్రశ్నించామని ఆయన అన్నారు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి
ఎస్సీ ఎస్టీల భూములే ఉన్నాయా మిగతా వర్గాల భూములు ఎందుకు సేకరించలేకపోయారు పొల్యూషన్ రాయిత పరిశ్రమలు అయితే స్వాగతిస్తాం పొల్యూషన్ పరిశ్రమలు అయితే ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదని ఆ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది ఆ ప్రభుత్వం పోయి ప్రజాపాలనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ కాంగ్రెస్
రేవంత్ రెడ్డిప్రభుత్వం
నేడు ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం హేనమైన చర్యాని ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వెంటనే ఉపసంతించుకోవాలి లేనియెడల సిపిఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో సిపిఐ కొత్తూరు మండల కార్యదర్శి ఎండి షకిల్ సిపిఐ కేశంపేట మండల కార్యదర్శి
గోవిందు నాయక్ ఏఐఎస్ఎఫ్
జిల్లా అధ్యక్షులు పవన్
జిల్లేడు చౌదరిగుడా మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ కొందుర్గు మండల కార్యదర్శి భాగాళ నరసింహ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఆకాష్ నాయక్ ఎండి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.