NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 12:09 pm Posted by : NAMASTHE BHARAT

మంచినీటి బావులన శుభ్రంగా ఉంచుకోవాలి.

మంచినీటి బావులన శుభ్రంగా ఉంచుకోవాలి.

-బావికి మురామ్మతుల పనులను ప్రారంభిస్తున్న అభినవ్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

గ్రామంలోని మంచినీటి బావులను శుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పార్టీ యువ నేత నూకల అభినవరెడ్డి అన్నారు. మంగళవారం మరిపెడ మండలం.పురుషోత్తమాయగూడెం గ్రామంలో మంచినీటి బావి మరమ్మతుల కోసం ఆయన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం సీజన్ లో తాగునీరు ఎలాంటి కలుషితం కాకుండా స్థానిక సర్పంచ్ గ్రామపంచాయతీ సిబ్బంది తెగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక
సర్పంచ్ వెన్నెల నాగరాజు, ఉప సర్పంచ్ దేశెట్టి శ్రీనివాస్, పటేల్ దుర్గయ్య, రాజీల్క శ్రీనివాస్ చారి, మల్యాల శ్యాం, దండగల వెంకన్న, వంగూరి వెంకన్న,రాజీల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.