NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 2:36 pm Posted by : NAMASTHE BHARAT

నిజాంపేట్‌లో రూ.65 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

నిజాంపేట్‌లో రూ.65 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

-కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కొలన్ హన్మంత్ రెడ్డి హామీ

-కొలన్ నారాయణ రెడ్డి కాలనీలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

-సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి పనులు

ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన కాంగ్రెస్ ఇంచార్జి

శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు

కుత్బుల్లాపూర్, జులై 6 నమస్తే భరత్ :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 273వ డివిజన్ నిజాంపేట్ పరిధిలోని కొలన్ నారాయణ రెడ్డి కాలనీలో రూ.65 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
కాలనీలో సీసీ రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా రూ.65 లక్షలు మంజూరు చేయించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
అనంతరం కాలనీలోని పలు రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులను పరిశీలించిన ఆయన, స్థానికులు సూచించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కొలన్ హన్మంత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కోట మురళి, బాచుపల్లి అధ్యక్షుడు కొలన్ జీవన్ రెడ్డి, మౌళేశ్వర్ రావు, ఇందిరా కడియాల, అసోసియేషన్ సభ్యులు రమణ రెడ్డి, చిర్ర శ్రీనివాస్ రెడ్డి, జె. నాగి రెడ్డి, కొలన్ మాణిక్ రెడ్డి, కొలన్ వెంకట్ రెడ్డి, నాగేశ్వర్ రావు, సత్యనారాయణ, శ్రీకాంత్ రెడ్డి, వర్మ రాజు, మామిడ్ల శ్రీనివాస్, గిరిధర్, సత్య ప్రసాద్, విజయ్, జైపాల్ రెడ్డి, కోటి రెడ్డి, ఉపేందర్, కృష్ణ రెడ్డి, కొలన్ కృష్ణ రెడ్డి, కైలాష్, అంజి రెడ్డి, పి. శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు.