NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 9:27 pm Posted by : NAMASTHE BHARAT

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


షాపూర్‌నగర్ నల్లపోచమ్మ ఆలయంలో ఘనంగా ఆషాఢ బోనాల వేడుకలు
సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ – కూన శ్రీశైలం గౌడ్

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ఆకాంక్ష

కూన శ్రీశైలం గౌడ్‌కు షాపూర్ మార్కెట్ కమిటీ ఘన సత్కారం

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న స్థానిక నేతలు, భక్తులు, ప్రజలు

 

కుత్బుల్లాపూర్, ఆగస్టు 11 ( నమస్తే భరత్ ): షాపూర్‌నగర్ వెజిటబుల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో షాపూర్ మార్కెట్ సమీపంలోని నల్లపోచమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో నల్లపోచమ్మ తల్లికి కూన శ్రీశైలం గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని భక్తులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని సూచించారు. నల్లపోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం షాపూర్‌నగర్ వెజిటబుల్ మార్కెట్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేత కూన రాఘవేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు గుమ్మడి వెంకటేష్, షేక్ అజ్జు, రవి, నాని, అలాగే జగన్, విజయ్, ప్రభాకర్ రెడ్డి, ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.