NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 8:43 am Posted by : NAMASTHE BHARAT

దుబ్బాక లక్ష్మారెడ్డి భౌతికాయానికి.నివాళులర్పించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ 

దుబ్బాక లక్ష్మారెడ్డి భౌతికాయానికి.నివాళులర్పించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం, చిన్నగూడూరు మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డి నేడు కన్నుమూయడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మరిపెడ బంగ్లాలోని వారి నివాసానికి చేరుకున్న సత్యవతి రాథోడ్ లక్ష్మారెడ్డి భౌతికాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.లక్ష్మారెడ్డి వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక, రాజకీయ రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించారని, వారి మరణం ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటని ఆమె అన్నారు
భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు
కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, బండ బిక్షం రెడ్డి, బోడ శ్రీను నాయక్, కౌసల్యదేవిపల్లి సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి ,పెదబోయిన రంగన్న,షేక్ యాకుబ్ పాషా,యాకుబ్.పఠాన్,లింగమూర్తి,దుబ్బాక వెంకట్ రెడ్డి,బొమ్మకంటి వెంకట్ గౌడ్,తదితరులు. పాల్గొన్నారు