ప్రవీణ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన
మడిపల్లి మాజీ ఎంపిటిసి జక్కన్న మహబూబ్ రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం సోమవారం కుంట తండా కు చెందిన బానోత్ ప్రవీణ్ (25) నిన్న రాత్రి పాముకాటుకు గురై తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న తొర్రూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మాజీ ఎంపిటిసి జక్కన్న మహబూబ్ రెడ్డి గురువారం ప్రవీణ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరచి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వీరి వెంట సోమారపు కుంట తండా సర్పంచ్ బానోత్ విద్యాసాగర్, కిష్టాపురం గ్రామ నకిరేకంటి మాధవి సంపత్,మడిపల్లి మాజీ సర్పంచ్ గడీల మాధవి సాయిలు, వెన్నం సోమిరెడ్డి, మహంకాళి సంపత్, ఎర్రం రాజు యాదవ్,భీమ్లా నాయక్ పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.