సంవత్సరం దాటుతున్న సంక్షేమ బోర్డు ద్వారా
అందని ఆర్థిక సహాయం
కొండ ఉప్పలయ్య
సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు
నమస్తే భారత్ :-మరిపెడ
బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందవలసిన మ్యారేజ్ అండ్ డెలివరీ మరియు డెత్ బెనిఫిట్స్ లు అప్లై చేసిన సంవత్సరం దాటిన కూడా ఆర్థిక సహకారాలు అందడం లేదని సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లానాయకులు కొండ ఉప్పలయ్య అన్నారు ఈరోజు మరిపెడ మండల కేంద్రంలో కొండ వెంకన్న అధ్యక్షతన జరిగిన యూనియన్ మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు రావాల్సిన ఆర్థిక సహకారం సంవత్సరం అవుతున్న కార్మికులకు అందలేదని వారు వాపోయారు చనిపోయిన వారికి సంబంధించిన దరఖాస్తులను ఎక్కడ ఇవ్వాలని కార్మికులకు అర్థం కావడం లేదని ఏ ఎల్ ఓ ఆఫీస్ లో దరఖాస్తులు మేము తీసుకోము గతంలో ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కి అప్పచెప్పారని మాకింకా డెత్ బెనిఫిట్ సంబంధించిన దరఖాస్తులు తీసుకోవాలని ఆర్డర్స్ రాలేదని ఏ ఎల్ ఓ ఆఫీసర్లు చెపుతున్నారని వారు అన్నారు అలాగే అప్లై చేసుకున్న కొత్తవారికి కార్డ్స్ కూడా రావడం లేదని తొర్రూర్ ఏ ఎల్ వో పర్మిట్ కాదని వారు వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నారని దీనివల్ల రావలసిన బెనిఫిట్స్ గాని కొత్త కార్డులు గాని ఆలస్యం అవడానికి ఇదో కారణమని వారు అన్నారు తక్షణమే పెండింగ్లో ఉన్న క్లైమ్ లన్ని
పరిష్కరించాలని లేనిపక్షంలో ఎక్కడికక్కడ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాలరాశి నాలుగు లేబర్ కోడ్స్ తో కార్మికుల బతుకులుని వారి హక్కుల్ని తీసివేస్తానికి పగటిబందుగా ప్లానే ఈ లేబర్ కోడ్స్ అని వారు ఉన్నారు తక్షణమే ఈ లేబర్ కోడ్స్ ని రద్దుచేసి పాత పద్ధతిలోనే హక్కుల్ని అమలు చేయాలని లేని పక్షంలో దేశంలో ఉన్న కార్మికులంతా ఏకమై కేంద్ర సర్కారుకు బుద్ధి చెప్పక తప్పదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి యాదగిరి భిక్షం బండ వీరస్వామి వెంకన్న సైదులు జామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు