NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 10:45 pm Posted by : NAMASTHE BHARAT

రైతులు పంట మార్పిడితో సాగును సంరక్షించు కోవాలి

రైతులు పంట మార్పిడితో సాగును సంరక్షించు కోవాలి

ప్రకృతి పద్ధతిలో సాగుతో భూసారాన్ని కాపాడుకోవాలి

నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ కమిటి చైర్మన్

నమస్తే భారత్ :-డోర్నకల్

పంట మార్పిడి విధానాన్ని సాగులో పాటించడం వలన రైతులు లాభంతో పాటు సాగును.సంరక్షించుకోవచ్చునని ఆత్మ కమిటి చైర్మన్ నల్లు సుధాకర్.రెడ్డి.అన్నారు.డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రకృతి పద్ధతిలో సాగు చేపట్టి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచి,రసాయన వాడకాలను తగ్గించి, పంట వ్యర్ధాలను కాల్చకుండా భూమి సారాన్ని కాపాడు కోవాలని కోరారు.ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించుకుని భూమికి తగ్గ పంటలను, ఎరువులను వాడుతూ వైవిధ్యంతో కూడిన సాగు ద్వారానే వ్యవసాయాన్ని రక్షించుకోవచ్చు అని అన్నారు
యాసంగిలో వరి సాగు తగ్గించి, తక్కువ నీటితో పండే జొన్న, పప్పు ధాన్యల, నూనె గింజల మరియు కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యo ఇచ్చి సూపర్ ఎల్ నినో విపత్తు నుండి బయట పడాలని, నీరు విద్యుత్ ను రాబోయే కాలంలో పొదుపుగా వాడుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనిల్, సర్పంచ్ లు పగిడాల వెంకటేశ్వర్లు,శీను, ఏపి ఓ పార్థసారథి,ఏఈఓ పవన్ మరియు రైతులు పాల్గొన్నారు