NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 9:40 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడ మండల రైతులు ఐక్యంగా తరలిరావాలి – సీపీఐ జిల్లా సమితి సభ్యులు

మరిపెడ మండల రైతులు ఐక్యంగా తరలిరావాలి – సీపీఐ జిల్లా సమితి సభ్యులు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో మరిపెడ మండలంలోని రైతులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ పిలుపునిచ్చారు.
మరిపెడ మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులకు పంట నష్టపరిహారం, రుణ ఉపశమనం కల్పించాలని కోరారు.అలాగే నవంబర్ 5, 6, 7 తేదీల్లో సీపీఐ జిల్లా బృందం కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాలను, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలిపారు.
మరిపెడ మండలంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు, కర్షకులు ఐక్యంగా తరలివచ్చి నవంబర్ 10న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎం.డి. అబ్దుల్ రషీద్ విజ్ఞప్తి చేశారు.