వైవిధ్యం కల పంటల సాగు కై రైతులను చైతన్యవంతం చేయాలి
నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్
నమస్తే భారత్ :-సిరోలు
వ్యవసాయ రంగంలో వైవిధ్యంతో కూడిన పంటల సాగు వైపుకు రైతులను చైతన్యవంతం చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు
సిరోలు మండలం కాంపల్లి రైతు వేదికలో జరిగిన ఫెర్టిలైజర్స్ఫ,స్ట్ సైడ్స్ యజమానుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన మందులను ఎట్టి పరిస్థితులలో అమ్మకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన తరుణంలో రైతులు నష్టపోకుండా కూరగాయలు, నూనె గింజల పప్పు ధాన్యపు పంటల సాగుకు రైతులను ప్రోత్సహించే విధంగా, ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి సన్నాలని వేసే విధంగా చూడాలని, నానో డీఏపీ, నానో యూరియా వాడకంపై ప్రచారం చేయాలని షాప్ యజమానులకు సూచించారు
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని ఛాయారాజ్,ఏఈఓ భరత్, వ్యాపారులు సుస్మన్ రెడ్డి బద్రు, వీరన్న, దేవేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు