NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 7:59 pm Posted by : NAMASTHE BHARAT

ఓటరు జాబితా సవరణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి

*ఓటరు జాబితా సవరణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి*

*”సర్”కార్యక్రమాన్ని బిఎల్ ఏ 2 లు పూర్తి స్థాయిలో సహకరించాలి – ఏమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*”సర్ “కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాలను స్వయంగా పూరించి అవగాహన కల్పించిన ఎమ్మెల్యే*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై 01:కొందుర్గు మండల పరిధిలో టేకులపల్లి, ఉత్తరాస్ పల్లి గ్రామాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌.ఐ.ఆర్) కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాల ను పూరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వయంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని,అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు అత్యంత కీలకమని, ప్రతి పౌరుడు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొందుర్గు మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి,దామోదర్ రెడ్డి,కృష్ణారెడ్డి,జితేందర్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లేష్ గౌడ్,అంజి రెడ్డి,సర్పంచ్లు శ్రీశైలం, అమర్నాథ్ రెడ్డి,హాకా సెంటర్ యజమాని నర్సింహా రెడ్డి, పహిల్వాన్,మంత్రి మల్లేష్ పొట్ట సత్యం,పొట్ట రామచంద్రయ్య,శివ, హమీద్,రవీందర్ రెడ్డి,బొట్టు శ్రీను ఆదిల్,శశివర్ధన్,జంగయ్య, వార్డ్ సభ్యులు,అధికారులు తహసీల్దార్ అజమ్ అలీ,ఎంపీడీఓ శ్రీరామ్, ఇంజనీరింగ్ ఆఫీసర్ మధు, జీ.పీ.ఓ లు నరేష్,శ్రీకాంత్ బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.