NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 11:13 am Posted by : NAMASTHE BHARAT

నాగన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

నాగన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

శ్రమజీవుల పాటల శిఖరం
అరుణోదయ నాగన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి ఆలకుంట్ల సాయన్న అన్నారు.ఆదివారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ.నాగన్న గత 40,50 సంవత్సరాల నుండి ప్రతిఘటన పోరాట ఉద్యమంలో అనేక పాటలు రాశాడన్నారు.నాగన్న నోట పాడిన పాట ఘంటసాల గొంతు వాలే మోగించేవాడని,ఈ రాష్ట్రంలో వేలాది కళాకారులు నాగన్న గురించి ఎంతోమంది నాగన్న సంతాప సభను జరుపుకుంటూ అనేక పాటలు రాశారని, నాగన్న నిరంతరం ప్రజల మధ్య ఉంటూ కష్టజీవుల కార్మికుల కర్షకుల బతుకుల మారాలని వారి బాధలను పాటల రూపంలో రాశాడని, ప్రజలను నిత్యం పీడిస్తున్న పాలకవర్గాల కార్పోరేట్ శక్తుల దోపిడీ విధానాలను ఎండగట్టుతూ కళారూపంతో 50 సంవత్సరాలు నుండి ప్రజలను చైతన్య పరిచి వేలాది మంది ప్రజలను విద్యార్థులను పోరాటాల వైపు నడిపించిన విప్లవ శిఖరం అని తెలిపారు.ఆశయ సాధనలో మన అందరం కలిసి ప్రయాణం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రమేష్,కడియం యాకయ్య, వీరయ్య,మహేష్, అమర్ సింగ్, వీరన్న,భాష, బాలు, యాకు,మల్లేష్ వెంకటేశ్వర్లు,నాగరాజు, శ్రీనివాసు, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.