రాష్ట్రాలు వేరైనా.గౌడన్నల ఐక్యత ఒక్కటే

ఆపదలో ఉన్న గీత కార్మికుల కుటుంబాలకు గీతబంధు సేవా ట్రస్ట్ అండ
సీఐ బుర్ర సురేష్ గౌడ్ చొరవతో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
రెండు కుటుంబాలకు రూ.20 వేల చొప్పున చేయూతనిచ్చిన గీతబంధు సేవా ట్రస్ట్
నమస్తే భారత్ :-కేసముద్రం
గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రాలకతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆపదలో ఉన్న గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్న గీతబంధు సేవా ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ మానవతా దృక్పథంతో కేసముద్రం ప్రాంతంలోని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది.కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన మల్లేశం ఇటీవల తాడిచెట్టుపై గీత వృత్తి నిర్వహిస్తుండగా.ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే విలేజ్ కేసముద్రంకు చెందిన ఉట్కూరి శ్రీనివాస్ తాడిచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాళ్లు, చేతులు, నడుముకు తీవ్ర గాయాలు కావడంతో సుమారు పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి.
సీఐ బుర్ర సురేష్ గౌడ్ చొరవతో బాధిత కుటుంబాలకు చేయూత
బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకున్న ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీఐ బుర్ర సురేష్ గౌడ్ ఈ విషయాన్ని గీతబంధు సేవా ట్రస్ట్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో స్పందించిన ట్రస్ట్ ప్రతినిధులు కేసముద్రానికి చేరుకుని రెండు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. గౌడ సంఘం సభ్యులు సీఐ బుర్ర సురేష్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గీత కార్మికుల కుటుంబాల పరిస్థితిని తెలుసుకుని, వారి కష్టాలను గీతబంధు సేవా ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లి ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.ఏ రాష్ట్రంలో గీతన్నకు ఆపద వచ్చినా అండగా ఉంటాం: గీతబంద్ ట్రస్ట్ కార్యదర్శి సింహాచలం మాట్లాడుతూ.గీత కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తమ ట్రస్ట్ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రమాదవశాత్తు గీత వృత్తిలో పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోయిన వారికి, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమే ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమన్నారు.గీత కార్మికులు సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాలు ఆపద సమయంలో ఇబ్బందులు పడకుండా అవసరమైన సమయంలో సహాయం అందించాలనే లక్ష్యంతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా గీత కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా గీతబంధు సేవా ట్రస్ట్ ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.గీతబంధు సేవా ట్రస్ట్ సేవలు అమూల్యం– స్థానిక గౌడ సంఘం నాయకులు.ఈ సందర్భంగా కన్నె కన్నయ్య గౌడ్, మోడం రవీందర్ గౌడ్, రాడం వెంకన్న గౌడ్, చిలువేరు సమ్మయ్య గౌడ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా గీత కార్మికుల కోసం స్పందించి కేసముద్రం వచ్చి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన గీతబంధు సేవా ట్రస్ట్ సేవలు అమూల్యమైనవని కొనియాడారు.గీత కార్మికుల కుటుంబాలు కష్టాల్లో ఉన్న సమయంలో వారి బాధను అర్థం చేసుకుని, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సహాయం అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేసముద్రం వరకు వచ్చి గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలవడం గౌడన్నల ఐక్యతకు, మానవతా దృక్పథానికి నిదర్శనమని.అన్నారు.గీతబంధు సేవా ట్రస్ట్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా గీత కార్మికులకు అవసరమైన సమయంలో ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.
సింహాచలం కి ఘన సన్మానం
బాధిత గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన గీతబంధు సేవా ట్రస్ట్ కార్యదర్శి సింహాచలం ని ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించి అభినందించారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో జోగు డాంగయ్య గౌడ్,బండారి విజేందర్ గౌడ్, చింతనూరి వెంకన్న గౌడ్, గండి శ్రీనివాస్ గౌడ్,పబ్బటి.సారంగపాని,బండారి గోపి గౌడ్,ఓరుగంటి వెంకన్న,పోడేటి దినేష్ గౌడ్, రాడేం శ్రీనివాస్ గౌడ్,దొమ్మటి రాజు గౌడ్, బండారు గోపిచందర్, బండారు రాజు గౌడ్, బండారు శ్రవణ్ గౌడ్,పబ్బతి సత్యనారాయణ గౌడ్, బాధిత కుటుంబ సభ్యులు, గీత బంద్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు