NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 2:55 pm Posted by : NAMASTHE BHARAT

కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం సాధ్యం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

*కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం సాధ్యం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*గాంధీ భవన్ లో ఓబీసీ సెల్ జిల్లాల అబ్జర్వర్ల శిక్షణ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై 06:నేడు గాంధీ భవన్ లో రాష్ట్ర ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాల అబ్జర్వర్ల ల శిక్షణ క్యాంపు ను రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… జిల్లాలో పార్టీకి సమయం ఇచ్చి ,పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేసే ప్రతి కార్యకర్తను గుర్తించి జిల్లా ఓబీసీ సెల్ కార్యవర్గంలో,నియోజక వర్గాల ఓబీసీ అధ్యక్షులు మరియు కార్యవర్గం ఎంపికలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లాల అబ్జర్వర్లను (పరిశీలికులు) ఆదేశించారు.ఓబీసీల సంక్షేమం, అభివృద్ధి మరియు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే తమ ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఓబీసీ వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పించడం ద్వారా పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు,సమాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కన్వీనర్లు కేతురి వెంకటేష్,ధనలక్ష్మీ,జిల్లాల పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.