NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 10:23 pm Posted by : NAMASTHE BHARAT

శ్రీ కంఠమహేశ్వర గౌడ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక

శ్రీ కంఠమహేశ్వర గౌడ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఖానాపురం అక్టోబర్ 22((మల్లేష్ గౌడ్ ,నమస్తే భారత్) :
ఖానాపురం మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర గౌడ యువజన సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్షుడిగా మండల అనిల్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పెరుమాండ్ల శ్రీనాథ్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా ఓడపెల్లి ప్రవీణ్ గౌడ్, సహాయ కార్యదర్శిగా పెరుమాండ్ల ప్రకాష్ గౌడ్ ఎన్నికయ్యారు.
ముఖ్య సలహాదారులుగా పొలాగని జితేందర్ గౌడ్, ఆకుల ఉపేందర్ గౌడ్, ముంజాల రాజేందర్ గౌడ్, బత్తిని వెంకటేష్ గౌడ్, బత్తిని రాంబాబు గౌడ్, బీమగాని నరేష్ గౌడ్, గోడిశాల దేవేందర్ గౌడ్ ఎన్నికయ్యారు.

కమిటీ సభ్యులుగా తండా ప్రకాష్ గౌడ్, నాగేల్లి రాహుల్ గౌడ్, పాముకుంట్ల సంతోష్ గౌడ్, ఎలికట్టే రాణాప్రతాప్ గౌడ్, తండా నవీన్ గౌడ్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, కార్యదర్శి మాట్లాడుతూ గౌడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.