NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 7:37 pm Posted by : NAMASTHE BHARAT

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం*

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం*

*“శివుడు పేదల దేవుడు.. రాముడు ధనికుల దేవుడు” వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ*

*శివుడు, శ్రీరాముడిని రాజకీయాలకు వాడుకోవడం సరికాదు*

*హిందూ సమాజంలో చిచ్చు పెట్టే వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలి*

*రాముడు, శివుడు ఇద్దరూ హిందువుల ఆరాధ్య దైవాలే.. రాజకీయాలకు అతీతంగా చూడాలి*

**ద్రావిడులు–ఆర్యులు అంటూ సమాజాన్ని విభజించే వ్యాఖ్యలను ఖండించిన అందె బాబన్న, కక్కునూరి వెంకటేష్ గుప్తా,*

*షాద్‌నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన*

నమస్తే భారత్ షాద్‌నగర్ సెప్టెంబర్29: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన శివుడు–శ్రీరాముడి వ్యాఖ్యలు, ద్రావిడులు–ఆర్యులు అంటూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ షాద్‌నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అందె బాబన్న మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ సమాజాన్ని, ఆరాధ్య దైవాలను విభజించే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. శివుడు పేదల దేవుడు, శ్రీరాముడు ధనికుల దేవుడు అంటూ దేవుళ్లను వర్గాల వారీగా విభజించడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.ద్రావిడులు–ఆర్యులు, దక్షిణాది–ఉత్తరాది అంటూ ప్రజల మధ్య భేదాలను సృష్టించే వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు, సామాజిక సామరస్యానికి విరుద్ధమని అన్నారు. శ్రీరాముడు, పరమశివుడు కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవాలని, వారిని రాజకీయ వివాదాల్లోకి లాగడం తగదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజల విశ్వాసాలను గౌరవించాలని బాబన్న డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ మోహన్ సింగ్ నాయక్ పిట్టల సురేష్, చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, , శ్రీనివాస్ చారి, మురళి, సిరిపురం వెంకటరమణ గడ్డం కుమార్ కాసోజు శివకుమార్, పుట్నాల సాయి కుమార్ బీజేవైఎం ఫరూఖ్ నగర్ మండల్ అధ్యక్షులు మలిపెద్ది వివేక్ గుప్తా జంబుల నరసింహులు, ఉదయ్ కుమార్, మహేందర్ రెడ్డి గజ్జల ప్రవీణ్ కుమార్, రమణ, సాయి కుమార్, సుధాకర్ అప్ప,గట్టు శివ, సాయిరాం,కాసూజి శివ,రిషికేష్, రాకేష్,గజ్జల ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.