నెలలు గడుస్తున్న పూర్తికాక సాగుతున్న డ్రైనేజీ పనులు
వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న డిమాండ్ చేశారు
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో కార్గిల్ సెంటర్ నుండి సూర్యా పెట్రోల్ బంక్ వరకు రోడ్డుకు ఇరువైపులా మంజూరై డ్రైనేజీ పనులు ప్రారంభించి నాలుగు నెలలు గడిచిన ఇంతవరకు పూర్తికాక ఇంటి యజమానులు ఇంటిలో నుండి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని వర్షాకాలం వచ్చినందున వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న డిమాండ్ చేశారు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ప్రమాణాలు పాటించక వాడవలసినంత ఐరన్ సిమెంటు కంకర వాడటం లేదు ఇండ్ల ముందు కాలువ తోవగా వచ్చిన మట్టిని వాళ్లే ట్రాక్టర్లు పెట్టి అమ్ముకున్నారు అది తవ్వే ముందు మీ మట్టి మీకు తోలీస్తాము అన్నారు కానీ తరువాత తోలడం లేదు మీరే తోలుకోవాలని.దమాయిస్తున్నారు డ్రైనేజీ సైడ్ వాల్స్ సాలినంతా ఎత్తు లేకపోవడం వలన రోడ్డుపైన పోయే వరద మొత్తం చెత్త చెదారం మట్టితో సహా డ్రైనేజీలోకి పోయి డ్రైనేజీ పూడి పోయే ప్రమాదం ఉంది ఇది ఇలా జరగటం వలన లక్షలాదిలో రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ఏమి ఉపయోగం లేకుండా పోతుంది అందుకని డ్రైనేజీ కాల్వపైన కప్పు వేసి ఆ చెత్తచెదారం కాలువలో పడకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు తాటికొండ అనంత చారి టౌన్ సెక్రటరీ దొంతు సోమన్న బోడ కృష్ణ ఊరుకొండ గణేష్ దొంతు వెంకన్న బూర రవి గుమటవెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు