NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 8:27 pm Posted by : NAMASTHE BHARAT

పాపన్నపేటలో డ్రైనేజీ పనులు ప్రారంభం

పాపన్నపేటలో డ్రైనేజీ పనులు ప్రారంభం

పాపన్నపేటలో రూ. 7 లక్షలతో డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ పావని నరేందర్ గౌడ్

 

మెదక్ జిల్లా,పాపన్నపేట, మండల: సెప్టెంబర్ 9,(నమస్తే భారత్)

మండల కేంద్రమైన పాపన్నపేటలో బుధవారం పెద్దహరిజన వాడ నుండి పాతూరు నాయికోటి శ్రీనివాస్ ఇంటి వరకు డ్రైనేజీ పనులు ప్రారంభించినట్లు పాపన్నపేట సర్పంచ్ లింగంపేట పావని నరేందర్ గౌడ్ తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ఆర్ఈ జిఎస్ పథకం ద్వారా దాదాపు రూ.7లక్షలతో పనులను ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. హరిజన వాడ నుండి పాతూరుకు డ్రైనేజీ లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని,దీనితో కాలనీ వాసులకు కొంత ఉపశమనం కలిగినట్లు అయిందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంపేట నరేందర్ గౌడ్,ఉప సర్పంచ్ ఎండీ.సద్దాం, మాజీ ఉప సర్పంచ్ ఎండీ.ఖలీం,నాయకులు దోసని సంగమేశ్వర,ముశెట్టి కిష్టయ్య,సుంకరి శివయ్య,బెస్త శ్రీశైలం,వార్డు సభ్యులు ఎండీ. చోటుమియా,గులాం దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.