NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 10:21 pm Posted by : NAMASTHE BHARAT

గర్భవతులకు మరియు బాలింతలకు నీమోనియా వ్యాధి అవగాహన కల్పిస్తున్న డాక్టర్ స్రవంతి

*గర్భవతులకు మరియు బాలింతలకు నీమోనియా వ్యాధి అవగాహన కల్పిస్తున్న డాక్టర్ స్రవంతి*

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో ప్రపంచ నిమోనియా దినోత్సవ సందర్భంగా గర్భవతులకు మరియు బాలింత తల్లులకు చిన్నపిల్లలు వచ్చే నిమోనియా వ్యాధి గురించి అత్త స్రవంతి అవగాహన కల్పించారు. నిమోనియా అనేది ఊపిరితిత్తులలో వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాధి అని, దీనివల్ల ఊపిరితిత్తులలోని గాలి సంచులు వాపు కు గురై , వాటిలో నీరు లేదా చీము చేరుతుంది అని, ఫలితంగా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది అని డాక్టర్ స్రవంతి చెప్పారు. నిమోనియా రావడానికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ కారణమని; ముఖ్యంగా పిల్లల్లో నిమోనియా న్యూమోకోకల్ బ్యాక్టీరియా,వైరస్ వంటి సూక్ష్మజీవులు కారం అవుతాయని, ఈ వ్యాధి వచ్చినప్పుడు దగ్గు, జలుబు, జ్వరం రావడం, వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, చాతి లోపలికి లాగ బడటం, నీరసం మరియు అలసట కనిపించడం, తీవ్రమైన సందర్భాలలో పెదవులు, నాలిక, నీలం రంగులోకి మారుతాయి అని డాక్టర్ స్రవంతి గారు చెప్పారు. నిమోనియా వ్యాధి ఎక్కువగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వస్తుందని, ముఖ్యంగా రెండు సంవత్సరాల లోపు శిశువులకు మరియు వృద్ధులకు వస్తుందని, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి, పోషకాహారం లోపం ఉన్న పిల్లలకు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉందని డాక్టర్ స్రవంతి చెప్పారు. న్యూమోనియా వ్యాధి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా పిల్లలకు జాతీయ టీకాల కార్యక్రమం ప్రకారము, అన్ని టీకాలు వేయించాలని,టీకా వేయించాలని , పిల్లలకు మొదటి ఆరు నెలల లో కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని, మంచి పోషకాహారం అందించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, ఇంట్లో పొగ, దుమ్ము లేకుండా చూసుకోవాలని, దగ్గు , తుమ్ముల సమయంలో మాస్క్ లేదా టిష్యూ ఉపయోగించాలని, పిల్లలలో అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డాక్టర్ స్రవంతి గర్భవతులకు మరియు బాలింత తల్లులకు తెలియజేశారు. పిల్లలకు నిమోనియా వ్యాధి వచ్చినప్పుడు, బ్యాక్టీరియా వల్ల వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తారని, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తే తగిన చికిత్స అందిస్తారు అని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆక్సిజన్ అందిస్తారు అని, తీవ్రమైన పరిస్థితులలో వైద్యుల సలహాను బట్టి ఆసుపత్రికి వెంటనే తీసుకువెళ్లాలని డాక్టర్ స్రవంతి తెలియజేశారు.
*నిమోనియాను నివారిద్దాం-* *బాలల* *ప్రాణాలను కాపాడుదాం..!* అనే డాక్టర్ స్రవంతి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ శ్రీ రామ, స్టాఫ్ నర్స్ వినీత, ఫార్మసిస్ట్ పర్వతాలు, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్, ఏఎన్ఎంలు మధు వాణి, శిరీష, కవిత మరియు ఆశలు పాల్గొన్నారు.