ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు

ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు ఖానాపురం (మల్లేష్ నమస్తే భారత్ ) : పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాగంపేట గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఖానాపురం మండలం రాగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగ కార్యక్రమంలో భాగంగా రాగంపేట గ్రామానికి చెందిన కుందన పెళ్లి సంపత్ ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీపావళి టపాసులు కాల్చి...